ఈపీఎఫ్‌వో ఖాతాదారులకు దీపావళికి బోనస్

SMTV Desk 2019-10-16 15:20:26  

ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్‌వో) ఖాతాదారులకు అదిరిపోయే శుభవార్త అందించింది. 2019 దీపావళికి ఉద్యోగులకు బోనస్ అందిస్తున్నట్లు తాజాగా ప్రకటించింది. గ్రూప్ బి, గ్రూప్ సీ ఈపీఎఫ్‌వో ఉద్యోగులకు 60 రోజుల బోనస్ అందించాలని నిర్ణయించింది. దీంతో ఉద్యోగులకు ముందుగానే దీపావళి వచ్చినట్లు అయ్యింది.కేంద్ర కార్మిక శాఖ ఉద్యోగుల బోనస్‌కు సంబంధించి ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేసింది. గ్రూప్ బి, గ్రూప్ సి ఉద్యోగులందరికీ బోనస్ లభిస్తుంది. 2018-19 ఆర్థిక సంవత్సరానికి గానూ ప్రొడక్టివిటీ లింక్డ్ బోనస్ స్కీమ్‌లో భాగంగా ఈపీఎఫ్‌వో ఇప్పుడు తన ఉద్యోగులకు మొత్తంగా 60 రోజుల బోనస్ అందిస్తోంది.కార్మిక శాఖ నోటిఫికేషన్ ప్రకారం.. ఈపీఎఫ్‌వో గ్రూప్ బి, గ్రూప్ సి ఉద్యోగులకు 30.4 రోజుల చొప్పున బోనస్ వస్తుంది. అంటే ఈపీఎఫ్‌వో ఎంప్లాయీస్‌కు దాదాపుగా రూ.7,000 బోనస్ రావొచ్చు. అయితే ఉద్యోగి కేటగిరి ప్రాతిపదికన బోనస్ మొత్తం మారొచ్చు.అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది. ప్రొడక్టివిటీ లింక్డ్ బోనస్ మొత్తంలో కేవలం 25 శాతం మాత్రమే ఈపీఎఫ్‌వో ఎంప్లాయీస్ శాలరీ అకౌంట్‌లో క్రెడిట్ కానుంది. ఇక మిగిలిన 75 శాతం మొత్తం ఉద్యోగుల పీఎఫ్ అకౌంట్‌లలో జమవుతుంది. స్టేట్ ఎంప్లాయీస్ జాయింట్ కౌన్సిల్ కన్వీనర్ ఆర్‌కే శర్మ ఈ విషయాలను వెల్లడించారు.