భారీ స్కోరు సాధించిన భారత్...

SMTV Desk 2017-08-31 18:56:46  BCCI, India, Srilanka, fourt Odi, Colombo, Odi series, India Score

కొలంబో, ఆగస్ట్ 31: ఆతిథ్య జట్టుపై వరుస విజయాలు సాధిస్తున్న భారత్ నేడు కొలంబో వేదికగా ఆడిన నాలుగో వన్డేలో శ్రీలంక ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది. మొదట బ్యాటింగ్ ఆడిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 375 పరుగులు చేసి, 376పరుగుల భారీ లక్ష్యాన్ని లంకేయులకు ఇచ్చింది. భారత బ్యాట్స్‌మెన్‌లు కెప్టెన్ విరాట్ కోహ్లీ 131, రోహిత్ శర్మ 104 పరుగులతో సెంచరీలు పూర్తి చేయగా, శిఖ‌ర్ ధావ‌న్ 4, హార్ధిక్ పాండ్యా 19, లోకేశ్ రాహుల్ 7, మ‌నీష్ పాండ్యా 50, ధోనీ 49 పరుగులు చేశారు. శ్రీలంక బౌలర్లలో మాథ్యూస్ 2, ల‌తిష్ మ‌లింగ 1, ఫెర్నాండో 1, అకిల ధ‌నంజ‌య వికెట్ తీశారు. పరువు కోసం మిగిలిన రెండు వన్డేలలో గెలుపు సాధించాలనుకుంటున్న లంకేయులు ఈ లక్ష్యాన్ని చేధించగలదో లేదో వేచి చూడాలి.