క్రికెటర్ తో హన్సిక!!

SMTV Desk 2019-10-14 15:23:29  

తమిళంలో అందాల కథానాయికగా అభిమానులచేత విశేషంగా ఆదరించబడినవారిలో హన్సిక కూడా కనిపిస్తుంది. అక్కడి అగ్రకథానాయకులందరితోను కలిసి నటించిన హన్సిక, హారర్ చిత్రాల ద్వారా కూడా భారీ విజయాలను అందుకుంది. అలాంటి హన్సిక త్వరలో మరో హారర్ థ్రిల్లర్లో చేయడానికి సిద్ధమవుతోంది.

ఈ సినిమాలో ఆమె జోడీగా క్రికెటర్ శ్రీశాంత్ కనిపించనున్నాడు. క్రికెట్ కి దూరమైన ఆయన అప్పటి నుంచి సినిమాల వైపు ఆసక్తిని చూపుతూ వస్తోన్న సంగతి తెలిసిందే. 3D టెక్నాలజీతో రంగనాథన్ నిర్మిస్తున్న ఈ సినిమాకి హరిశంకర్ - హరీశ్ నారాయణ్ దర్శకులుగా వ్యవహరించనున్నారు. ఈ సినిమాకి హాలీవుడ్ సాంకేతిక నిపుణులు పనిచేయనుండటం విశేషం. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోన్న ఈ సినిమాను, త్వరలోనే సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు.