తలాక్ కోసం పోరాడిన మహిళల పిల్లలు ఏం అయ్యారు?

SMTV Desk 2017-08-31 18:42:16  Triple talaq, supreme Court, Historic Verdict, Child Misssing

పశ్చిమ బెంగాల్, ఆగస్ట్ 31: ముస్లీం మహిళలకు అండగా ముమ్మారు తలాక్‌పై భారత సుప్రీం కోర్టు చరిత్రాత్మకమైన తీర్పు ఇచ్చి వారం రోజులు గడవక ముందే దీని కోసం పోరాడిన మహిళలకు చేదు అనుభవం ఎదురైంది. ఈ సంచలనమైన తీర్పు కోసం పోరాడిన మహిళల పిల్లల అదృశ్యమవడం గమనార్హం. వివరాల్లోకి వెళ్తే... ఈ పోరాటం చేసిన ఐదుగురు మ‌హిళ‌ల్లో ఒక‌రైన ప‌శ్చిమ బెంగాల్‌కు చెందిన‌ ఇష్ర‌త్ జ‌హాన్ తీర్పు అనంతరం ఆమెకు, ఆమె పిల్లలకు రక్షణ కల్పించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి బెనర్జీని కోరారు. కాగా, నేడు ఆమె పిల్ల‌లు అదృశ్యంకావడం పెను దుమారం రేపింది. దీంతో త‌న ఇద్ద‌రు పిల్ల‌లు అదృశ్య‌మ‌య్యార‌ని గోలాబ‌రి పోలీస్ స్టేష‌న్‌లో ఆమె ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పిల్లల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. 2015లో ఏప్రిల్ నెలలో జ‌హాన్‌ భ‌ర్త దుబాయ్ నుంచి ఆమెకు ఫోన్ చేసి త‌లాక్ చెప్పాడు.