ద్వైపాక్షిక సంబంధాలు బలపరుచుకునే దిశగా అడుగులు

SMTV Desk 2019-09-26 18:03:31  

ద్వైపాక్షిక సంబంధాలు బాల పరుచుకునే దిశగా భారత్ అడుగులు వేస్తోంది.ఐక్యరాజ్య సమితి లో సర్వసభ్యసమావేశాలలో పాల్గొనడానికి వెళ్ళిన ప్రధాన మంత్రి మోదీ బుధవారం ఇటలీ,ఇతర దేశాధి నేతలతో భేటీ అయి పలు కీలక అంశాలు చర్చించారు. ఇక భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్‌ వివిధ దేశాల విదేశాంగ మంత్రులతో బుధవారం సమావేమయ్యారు. చైనా, ఆస్ట్రేలియా, యుక్రెయిన్‌ దేశాల విదేశాంగ మంత్రులతో జైశంకర్‌ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇంధన, సాంకేతిక రంగాలకు సంబంధించి సహకారంపై చర్చించారు. ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసుకునే అంశంపై చర్చలు జరిపారు.