SSC CGL - 2018 టైర్-2 ఆన్సర్ 'కీ' విడుదల..

SMTV Desk 2019-09-24 15:01:36  

SSC (స్టాఫ్ సెలక్షన్ కమిషన్) సెప్టెంబరు 11 నుంచి 14 వరకు దేశవ్యాప్తంగా పలు కేంద్రాల్లో ఆగస్టు 20న వెల్లడైన టైర్-1 పరీక్ష ఫలితాల్లో అర్హత సాధించిన 1,50,396 మంది అభ్యర్థులకు కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్-2018 టైర్-2 పరీక్షలను నిర్వహించిన సంగతి విదితమే. ఈ పరీక్షకు సంబంధిన ఆన్సర్ కీని SSC విడుదల చేసింది. SSC తన అధికారిక వెబ్‌సైట్‌లో ఈ ఆన్సర్ కీని అందుబాటులో ఉంచింది. CGL టైర్-2 పరీక్షలకు హాజరైన అభ్యర్థులు వెబ్‌సైట్ ద్వారా ఆన్సర్ కీ ని పొందవచ్చు. ఆన్సర్ కీతోపాటు అభ్యర్థులు రెస్పాన్స్ షీట్లను కూడా SSC అందుబాటులో ఉంచింది. ఆన్సర్ కీపై ఎవరికైనా సందేహాలుంటే సెప్టెంబరు 26 సాయంత్రం వరకు అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా ఒక్కో అభ్యంతరానికి రూ.100 ఫీజు చెల్లించి తమ అభ్యంతరాలు తెలపాల్సి ఉంటుంది.. నిర్ణీత గడువు దాటాక వచ్చే అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోరు.