ఆరోగ్యకరమైన, ఒత్తయిన జుట్టు కోసం....

SMTV Desk 2019-09-23 11:09:53  

ఎండ, ఇతరత్రా కారణాలతో జుట్టు చిట్లినప్పుడూ,
బాగా పాడయినప్పుడూ రెండు కప్పుల తాజా నిమ్మర
సంలో రెండు టేబుల్‌ స్పూన్ల ఆలివ్‌ నూనె కలిపి తలకు
పట్టించాలి. ఇరవై నిమిషాల తరవాత షాంపూతో
తలస్నానం. చేయాలి. ఇలా వారానికోసారి చేస్తుంటే
సమస్య దూరమవుతుంది. లేదంటే... అరకప్పు తేనెను
శుభ్రమైన తడి జుట్టుకి రాసుకుని ఇరవై నిమిషాలు
ఆరనివ్వాలి. గోరువెచ్చని నీటితో శభ్రపరుచుకోవాలి.
అవసరాన్ని బట్టి దీనికి ఒక టేబుల్‌స్పూన్‌ ఆలివ్‌నూనెను
కలుపుకోవచ్చు ఈ మిశ్రమం అతినీలలోహిత కిరణాల
నుంచి జుట్టుని కాపాడుతుంది.

జుట్టు నిర్జీవంగా కనిపిస్తున్నప్పుడు అరకప్పు పుల్లటి
పెరుగూ, చెంచా తేనె కలిపి జుట్టుకి పట్టించాలి.
ఇరవై నిమిషాలయ్యాక గోరువెచ్చని నీళ్లతో శుభం
చేసుకుని చన్నీళ్లతో షాంపూ చేసుకోవాలి. ఇలా
వారానికోసారి చేస్తుంటే జుట్టు నిగనిగలాడుతుంది.
ఆరోగ్యంగా ఎదుగుతుంది.



కలబంద రసానికి, చెంచా తేనె చెంచా నిమ్మరసం
కలిపి ఆ మిశ్రమాన్ని తలకు పట్టించాలి. పావుగంట
తరవాత గోరువెచ్చని నీళ్లతో తలస్నానం చేయాలి.
ఇలా చేయడం వల్ల జుట్టుకీ, మాడుకీ కావల్సిన తేమ
అందుతుంది.