ప్రమాదానికి ఐదు నిమిషాల ముందు!!

SMTV Desk 2019-09-16 11:50:32  

అటు పాపికొండలు...ఇటు గోదావరమ్మ ప్రవాహం...హోరు గాలి మేనును తాకుతుంటే...వరద ప్రవాహం హోరెత్తిస్తుంటే పర్యాటకుల్లో ఒక్కటే సందడి. ప్రకృతి అందాలను వీక్షిస్తూ ఆనంద పరవశులై తమను మార్చిపోయి గోదారమ్మ ప్రవాహ వేగంతో పోటీ పడినంతలా కుటుంబ సభ్యులు, స్నేహితులతో సందడి చేస్తున్నారు. సెల్ఫీలు తీసుకుంటూ మధురమైన జ్ఞాపకాలను పదిల పరుచుకునే పనిలో మరికొందరు ఉన్నారు. గోదావరి అందాలు, పాపికొండల మనోహరాన్ని వీడియో తీసి తమ పర్యాటక అనుభవనాన్ని తోటి వారితో పంచుకునేందుకు సిద్ధం చేసుకుంటున్నారు. ఇంతలోనే పెద్ద కుదుపు. ఏం జరిగిందా అని అంచనా వేసేలోగానే గోదావరి జలాల్లో బోటు మునిగిపోవడంతో ఒక్కసారిగా హాహాకారాలు. అరుపులు, కేకలు కూడా కాసేపటికి ఆగిపోయాయి. అప్పటి వరకు సందడి సందడి నెలకొన్న ప్రాంతంలో కాసేపు నిశ్శబ్దం ఆవరించింది. గోదావరిలో బోటు ప్రమాదానికి ఐదు నిమిషా ముందు తీసిన ఈ వీడియో ఇప్పుడు నెటిజన్లను విశేషంగా ఆకర్షిస్తోంది.