నన్నపనేని రాజకుమారిని అరెస్ట్ చేయాల్సిందే!!

SMTV Desk 2019-09-13 13:06:32  

తెలుగుదేశం పార్టీ నేత నన్నపనేని రాజకుమారి తనను కులం పేరుతో దూషించారని గుంటూరులో మహిళా పోలీస్ ఎస్సై అనురాధా తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. టీడీపీ ఇటీవల చేపట్టిన ‘ఛలో ఆత్మకూరు’ కార్యక్రమం సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలో గుంటూరు జిల్లాలోని మంగళగిరిలో వైసీపీ, దళిత సంఘాలు ఈరోజు నన్నపనేని తీరుకు వ్యతిరేకంగా భారీ ర్యాలీ చేపట్టాయి.

ఈ ర్యాలీలో వైసీపీ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి(ఆర్కే) పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆందోళనకారులు నన్నపనేని రాజకుమారి దళిత మహిళా ఎస్సైతో దురుసుగా ప్రవర్తించారని ఆరోపించారు. కాబట్టి నన్నపనేని రాజకుమారిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా నన్నపనేని తీరుపై ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.