ఇండియన్‌ వైఫ్‌కి సరైన అర్థం చెప్పిన దీపిక పడుకొన్!!

SMTV Desk 2019-09-11 15:16:54  

ఏ వస్తువైనా ఉచితంగా వస్తే డబ్బులు మిగులుతాయని ప్రతి ఇల్లాలూ ఆలోచిస్తుంటుంది. అందుకు సినిమా సెలబ్రిటీలు మినహాయింపు కాదు. ప్రస్తుతం బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ దీపికా పడుకోన్‌ ఇలాగే ఆలోచిస్తున్నారు. అసలు విషయంలోకి వెళ్తే.. ఆమె భర్త రణ్‌వీర్‌ సింగ్‌ ఓ కంపెనీ హెడ్‌ఫోన్స్‌, మ్యూజిక్‌ సిస్టమ్‌కు గ్లోబల్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారు. ఆ విషయాన్ని హెడ్‌సెట్‌ను పెట్టుకుని ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఫొటో షేర్‌ చేసి అభిమానులతో పంచుకున్నారు.

పోస్ట్‌ చేసిన కాసేపట్లోనే ‘‘ఇంట్లో నేను సతాయించినప్పుడల్లా నా మాటలు నీ చెవిన పడకుండా నువ్వు ఈ ఇయర్‌ ఫోన్స్‌ పెట్టేసుకుంటావు కదా’’ అని కామెంట్‌ చేశారు దీపికా పడుకోన్‌. మ్యూజిక్‌ సిస్టమ్‌తో ఉన్న మరో ఫోటోనుచూసి ‘ఇలాంటి హెడ్‌ఫోన్స్‌ ఇంటికి తీసుకురావచ్చు కదా.. కనీసం డబ్బులైనా మిగులుతాయి’ అని రిప్లై ఇచ్చారు. అప్పటికప్పుడు ఈ కామెంట్స్‌కు పదివేలకు పైగా లైకులు, వందల్లో కామెంట్లు వచ్చాయి. ‘ఇండియన్‌ వైఫ్‌కి సరైన నిర్వచనం చెప్పావు దీపిక బాబీ’ అంటూ పలువురు నెటిజన్లు సరదాగా కామెంట్లు పెట్టారు.