నాలుగో వన్డేలో టాస్ గెలిచిన టీమిండియా

SMTV Desk 2017-08-31 15:29:57  BCCI, India, Srilanka, fourth Odi, Colombo, Odi series

కొలంబో, ఆగస్ట్ 31: భారత్-శ్రీలంక మధ్య జరుగుతున్న ఐదు వన్డే మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా నేడు కొలంబో వేదికగా నాలుగో వన్డే జరుగుతుంది. ఈ వన్డే మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్ ఎన్నుకుంది. గత మూడు వన్డేలలో విజయం సాధించి సిరీస్‌ను భారత్ కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో మిగతా రెండు మ్యాచ్‌లలో కూడా విజయం చేజిక్కించుకొని క్లీన్ స్వీప్ చేయాలనే ఆలోచనలో భారత్ ఉంది. అయితే వరుస పరాజయాల పాలౌతున్న లంకేయులు ఈ రెండు వన్డేలలో అయిన గెలిచి పరువు కాపాడుకోవాలని భావిస్తున్నారు. ఈ కారణంగా జట్టులో పలు మార్పులు చేసి లంకేయులు బరిలో నిలిచారు. కాగా, మూడో వన్డేలో ఎలాంటి ప్రయోగాలు చేయని భారత్ ఈ మ్యాచ్‌లో ఛాహ‌ల్‌, జాదవ్, భువ‌నేశ్వ‌ర్ కుమార్‌ల‌కు విశ్రాంతి కల్పించి, వారి స్థానాలలో శార్దూల్ ఠాకూర్‌, కుల్దీప్ యాద‌వ్‌, మ‌నీష్ పాండేల‌కు చోటు కల్పించింది.