హీరోయిన్ గా మారిన మరో చైల్డ్ ఆర్టిస్ట్!!

SMTV Desk 2019-09-11 15:12:53  

తెలుగు తెరకి ఉండిపోరాదే సినిమాతో కొత్త హీరోయిన్ పరిచయమైంది .. ఆ అమ్మాయి పేరే లావణ్య . సినిమా ఫలితం ఎలా ఉన్నప్పటికీ, లుక్స్ పరంగా .. నటన పరంగా లావణ్య మంచి మార్కులు కొట్టేసింది. తాజా ఇంటర్వ్యూలో లావణ్య మాట్లాడుతూ, "నేను 6వ తరగతి చదువుతున్నప్పుడే శ్రీకాంత్ గారి సినిమా అ ఆ ఇ ఈ సినిమాలోను, ప్రభాస్ డార్లింగ్ సినిమాల్లోను చైల్డ్ ఆర్టిస్ట్ గా చేశాను. ఆ తరువాత పూర్తిగా చదువుపైనే దృష్టిపెట్టాను.

భీమవరం కాలేజ్ లో బీటెక్ చదువుతూ షార్ట్ ఫిలిమ్స్ చేశాను .. అవి మంచి పేరు తెచ్చిపెట్టాయి. ఈ నేపథ్యంలోనే ఉండిపోరాదే సినిమాలో చేసే అవకాశం వచ్చింది. ఈ సినిమాలో నాకు మంచి పాత్ర పడింది. నటనకి అవకాశం వున్న ఈ తరహా పాత్రలు చేయడానికి నేను ఆసక్తిని చూపుతాను. మొదటి నుంచి కూడా నాకు నిత్యామీనన్ నటన అంటే ఇష్టం. ఆమె సినిమాలు ఎక్కువగా చూస్తాను. హీరోయిన్ గా ఆమెలా మంచి పేరు తెచ్చుకోవాలని వుంది" అని చెప్పుకొచ్చింది.