మహానంది ప్రధాన గోపుర కలశాలకు కోతుల దెబ్బ

SMTV Desk 2019-09-09 11:41:09  

కర్నూలు జిల్లా పరిధిలోని నల్లమల ఆడవుల్లో స్వయంభువుగా వెలిసిన మహానంది క్షేత్రం, ప్రధాన గోపురం కలశాలు పక్కకు ఒరిగి పోవడంతో భక్తులు ఆందోళనకు గురయ్యారు. ఈ ప్రాంతంలో కోతుల బెడద విపరీతంగా పెరిగిపోవడం, అవన్నీ గోపురం పైకి ఎక్కి, కలశాలను పట్టుకుని తమ విన్యాసాలను ప్రదర్శిస్తుండటంతోనే కలశాలు పక్కు ఒరిగాయని అధికారులు తేల్చారు. నిన్న గోపురం కలశాలు ఒరగడాన్ని గమనించిన భక్తులు, విషయాన్ని దేవస్థానం దృష్టికి తీసుకు వెళ్లడంతో, ఓ ఉద్యోగిని పైకి ఎక్కించి కలశాలను తిరిగి నిలువుగా ఉంచారు. కొన్ని రోజుల తరువాత మంచి ముహూర్తం చూసుకుని, పీఠాధిపతుల సమక్షంలో ప్రధాన గోపురం సహా, మిగతా గోపురాలకు నూతన కలశాలను ప్రతిష్ఠింపజేస్తామని ఆలయ పండితులు వెల్లడించారు.