వర్మ తరువాతి బయోపిక్ ఎవరిపైనా?

SMTV Desk 2017-08-31 14:48:50  Ram Gopal Varma, Gurmeet Ram Rahim Singh, Biopic, Director Ram gopal Varma next film,Bollywood

ముంబై, ఆగస్ట్ 31: కాంట్రవర్సీ దర్శకుడు రాంగోపాల్ వర్మ మరో సంచలనం సృష్టించారు. హర్యాణ, పంజాబ్‌లలో తీవ్ర సంచలనం సృష్టించిన డేరా స‌చ్చా సౌధా చీఫ్ గుర్మీత్ బాబాపై వర్మ సినిమా తీయనున్నట్లు సినీ వర్గాలలో గుసగుసలు మొదలయ్యాయి. ఈ బయోపిక్‌లో గుర్మీత్ బాబా పాత్రకు వర్మ పలువురి బాలీవుడ్ నటుల పేర్లు పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో ఇప్పటికే గుర్మీత్ సింగ్‌కు సంబంధిచిన పలు విషయాలు వర్మ తెలుసుకున్నాడట. అత్యాచారం కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్క్లొన్న గుర్మీత్‌కి నేరం రుజువైన కారణంగా సీబీఐ కోర్టు ఇర‌వై ఏళ్ల జైలు శిక్ష విధించిన విషయం తెలిసిందే. అయితే వర్మ బయోపిక్‌లో బాబాకి సంబంధించిన నేరాలు మాత్రమే కాకుండా గుర్మీత్ చేసిన పలు మంచి పనులు కూడా చిత్రీకరిస్తాడని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. త్వరలోనే గుర్మీత్ జీవిత చరిత్రకు సంబంధించిన సినిమాపై వర్మ అధికారిక ప్రకటన చేస్తాడనే వార్తలు వినిపిస్తున్నాయి.