కరీంనగర్‌లో మహిళ దారుణ హత్య

SMTV Desk 2019-09-09 11:39:04  

భర్తతో విడిపోయి ఒంటరిగా జీవిస్తూ ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ నిర్వహిస్తున్న ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. పోలీసుల కథనం ప్రకారం.. సిద్దిపేటకు చెందిన అమల భర్తతో విభేదాల కారణంగా ఒంటరిగా ఉంటోంది. గత కొన్నాళ్లుగా కరీంనగర్‌లో ఓ ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ నిర్వహిస్తోంది. ఆదివారం ఆమెను గుర్తు తెలియని వ్యక్తులు కొందరు కత్తులతో దారుణంగా పొడిచి చంపారు. చంపింది ఎవరు? ఎందుకు చంపారు? అన్న విషయాలు తెలియరాలేదు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.