తెలంగాణ డీజీపీకే ఫైన్ విధించిన ట్రాఫిక్ పోలీసులు!

SMTV Desk 2019-09-07 16:15:19  

చట్టానికి ఎవరూ అతీతులు కాదనీ, అందరూ సమానులేనని తెలంగాణ ట్రాఫిక్ పోలీసులు నిరూపించారు. రాంగ్ రూట్లో తమ బాస్ కారు వెళ్లినప్పటికీ జరినామా విధించి శభాష్ అనిపించుకున్నారు. ఈ ఘటన తెలంగాణలోని సంగారెడ్డిలో చోటుచేసుకుంది. ఈ నెల 3న డీజీపీకి చెందిన కారు సంగారెడ్డిలో రాంగ్ రూట్ లో వెళుతుండగా ఎవరో సామాన్యుడు ఫొటో తీసి సోషల్ మీడియా ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఫొటో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. దీంతో కారు వివరాలను పోలీసులు ఆరా తీయగా, అది తెలంగాణ డీజీపీ ఎం.మహేందర్ రెడ్డి పేరుపై ఉన్నట్లు గుర్తించారు. నిబంధనల మేరకు రూ.1,135 ల జరిమానా విధించారు.