స్వల్పంగా పెంపు!

SMTV Desk 2019-08-31 13:07:04  

శనివారం(ఆగస్ట్31) పసిడి ధర స్వల్పంగా పైకి కదిలింది. హైదరాబాద్ మార్కెట్‌లో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.10 పెరుగుదలతో రూ.40,250కు చేరింది. అంతర్జాతీయంగా బలహీనమైన ట్రెండ్ ఉన్నా కూడా జువెలర్లు, రిటైలర్ల నుంచి డిమాండ్ పుంజుకోవడంతో పసిడి ధరపై సానుకూల ప్రభావం పడిందని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. అదేసమయంలో 10 గ్రామలు 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.10 పెరుగుదలతో రూ.36,900కు చేరింది. బంగారం ధర పెరిగితే వెండి ధర మాత్రం స్థిరంగా కొనసాగింది. కేజీ వెండి ధర రూ.48,500 వద్దనే ఉంది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్‌‌ లేకపోవడం ఇందుకు కారణం. విజయవాడ, విశాఖపట్నంలో కూడా ధరలు ఇలానే ఉన్నాయి. గ్లోబల్ మార్కెట్‌లో శుక్రవారం బంగారం ధర దిగొచ్చింది. పసిడి ధర ఔన్స్‌కు 0.50 శాతం తగ్గుదలతో 1,529.15 డాలర్లకు క్షీణించింది. అదేసమయంలో వెండి ధర ధర ఔన్స్‌కు 0.84 శాతం పెరుగుదలతో 18.47 డాలర్లకు ఎగసింది. ఢిల్లీ మార్కెట్‌లో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.10 పెరుగుదలతో రూ.39,210కు చేరింది. ఇక 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.10 పెరుగుదలతో రూ.38,010కు ఎగసింది. ఇక కేజీ వెండి ధరలో ఎలాంటి మార్పు లేదు. రూ.48,500 వద్దనే స్థిరంగా కొనసాగుతోంది.