పక్షిని వేటాడిన పైథాన్!

SMTV Desk 2019-08-31 13:06:26  

నేలపై పాకే కొండచిలువ పక్షులను వేటాడం ఎప్పుడైనా చూసారా. తాజాగా ఆస్ట్రేలియాలో ఇదే సంఘటన చోటుచేసుకుంది. ఇటీవల ఆస్ట్రేలియా వెళ్లిన క్యాండికేన్ అనే పర్యాటకుడు ఉదయం నిద్రలేచి కిటికీ నుంచి బయటకు చూడగానే.. షాకింగ్ దృశ్యం కనిపించింది. కొండ చిలువ కిటికీకి వేలాడుతూ ప్రత్యక్షమైంది. అది ఓ పక్షిని వేటాడి, శరీరంతో చుట్టేసింది. దీంతో క్యాండీ‌కేన్ ఆ దృశ్యాన్ని వీడియో తీసి ‘రెడిట్’ అనే సోషల్ మీడియా సైట్‌లో పోస్టు చేశాడు. దీంతో అది క్షణాల్లో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో ఆ కొండ చిలువ చాలాసేపు పక్షిని బిగించి పట్టుకుని ఉంది. చివరికి దాని తలను నోట్లో పెట్టుకుని మింగేసింది. ఈ పామును కార్పెట్ పైథాన్ అంటారని, ఆస్ట్రేలియాలో ఇది నిత్యం ఇళ్ల లోపల, పైనా కనిపిస్తుంటాయని క్యాండికేన్ తెలిపాడు. ఈ వీడియోను కింది ట్వీట్‌లో చూడండి.