బ్యాంకులకు సెప్టెంబర్ సెలవులు ఇవే

SMTV Desk 2019-08-31 13:04:50  

ప్రస్తుత రోజల్లో ప్రతి ఒక్కరూ నగదు వ్యవహారాలతో బిజీబిజీ అయిపోతున్నారు. బిజినెస్ వ్యవహారాలు న‌డిపే వారికి బ్యాంకుల్లో చెక్కులు డిపాజిట్ చేయ‌డం, డీడీలు జ‌మ చేయ‌డం వంటివి ఉన్నందున దాదాపు ప్రతి ప‌ని దినమూ ముఖ్యమే. కొన్ని సందర్భాల్లో బ్యాంకు సెల‌వుల దృష్ట్యా ముందు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే వచ్చే నెల (సెప్టెంబర్)లో బ్యాంకులకు ఎప్పుడెప్పుడు సెలవులు ఉన్నాయో ముందుగానే తెలుసుకోవడం మంచిది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో సెప్టెంబర్‌ నెలలోని రెండు, నాలుగో శనివారాలైన 14, 28 తేదీల్లో బ్యాంకులు పనిచేయవు. ఇకపోతే సెప్టెంబర్‌ నెల‌లో వ‌చ్చే ఐదు ఆదివారాలు 1, 8, 15, 22, 29 తేదీల్లో ఎలాగూ బ్యాంకులకు సెలవు. వీటికి అదనంగా బ్యాంకు ఉద్యోగులకు మరో రెండు రోజులు సెలవులు ఉన్నాయి. 2వ తేదీ సోమవారం వినాయక చవితి (గణేశ్ చతుర్థి) సందర్భంగా బ్యాంకులు పనిచేయవు. అలాగే 10వ తేదీ మంగళవారం మొహరం పండుగ కారణంగా బ్యాంకులకు సెలవు. ఇరు తెలుగు రాష్ట్రాల్లోని బ్యాంకులకు ఇవే సెలవులు వర్తిస్తాయి. ఇకపోతే బ్యాంకులకు సెలవులు ఉన్నా కూడా నెట్ బ్యాంకింగ్ చేసేవారికి మాత్రం ఎటువంటి ఆటంకాలు ఉండ‌వు. ఆన్‌లైన్, డిజిటల్‌ లావాదేవీలు యథావిథిగా కొనసాగుతాయి. ఏదేమైనా ఎప్పుడైనా బ్యాంక్ సెల‌వు ఉంటే.. అప్పుడు ఆయా రోజుల్లో ఏదైనా న‌గ‌దు లావాదేవీ వ్యవహారాలు ప్లాన్ చేసి ఉంటే దానికి త‌గ్గట్లుగా ఇప్పటి నుంచే సిద్ధమవ్వడం మంచిది.