పిల్లలకు రెండు సంవత్సరాలు రాగానే, వారి బాధ్యతంతా ప్రభుత్వానిదా?: సీఎం యోగి ఆదిత్యానాథ్

SMTV Desk 2017-08-31 13:40:20  Uttarapradesh Chief Minister, Gorakhpur, BRD Medical college,Yogi Adityanath

గోరఖ్‌పూర్, ఆగస్ట్ 31: గత 15రోజులగా గోరఖ్‌పూర్ బాబా రాఘవ్ దాస్ (బీఆర్డీ) మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో 290 మంది చిన్నారులు చనిపోవడం యావత్ భారతదేశాన్ని కలచి వేసింది. అయితే ఈ ఘటనపై సీఎం యోగి ఆదిత్యానాథ్ తాజాగా ఒక సంచలన వ్యాఖ్య చేశారు. పిల్లలకు రెండు సంవత్సరాలు రాగానే, వారి బాధ్యతంతా ప్రభుత్వానిదే అన్నట్టు తల్లిదండ్రులు భావిస్తున్నారు. వారి బాధ్యతలను ప్రభుత్వంపై వేస్తున్నారు. పిల్లలు చనిపోతుంటే, ప్రభుత్వానిదా బాధ్యత?" అని సీఎం యోగి ప్రశ్నించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో విధులు నిర్వర్తించే వైద్యులు ప్రైవేట్ ఆసుపత్రిలో పనిచేయడం పై ఓ మీడియా ఛానల్ చేపట్టిన స్టింగ్ ఆపరేషన్ విషయంపై కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. చిన్నారు మరణాలపై విచారణకు ఉత్తర్వులు జారీ చేశామని, విచారణ నివేదికను బట్టి తగు చర్యలు తీసుకుంటామని ఆయన వెల్లడించారు.