వెంకయ్యనాయుడును కలిసిన సింధు

SMTV Desk 2019-08-31 13:00:14  

వరల్డ్‌ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌ పీవీ సింధు తాజాగా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సింధు సియోల్ వేదికగా జరిగిన కొరియా ఓపెన్ బ్యాడ్మింటన్ ఫైనల్‌లో పీవీ సింధూ తనకు వచ్చిన బంగారుపతకాన్ని ఉపరాష్ట్రపతికి చూపించారు. కాగా స్వర్ణం సాధించి ప్రపంచ ఛాంపియన్ గా నిలిచిన పీవీ సింధూను వెంకయ్యనాయుడు అభినందించారు. దేశం గర్వపడేలా సింధూ స్వర్ణం సాధించి ఛాంపియన్ గా నిలిచిందని ఉప రాష్ట్రపతి ఆమెను కొనియాడారు. యువత ఫిట్ గా ఉంటూ సింధూను ఆదర్శంగా తీసుకొని ఉన్నత శిఖరాలకు ఎదగాలని వెంకయ్య పిలుపునిచ్చారు.