కరెంట్ బిల్లుకు కూడా డబ్బులు లేవు!

SMTV Desk 2019-08-30 12:48:31  

పాకిస్తాన్ ఎంత పేదరికాన్ని అనుభవిస్తుందో ఈ వార్త ద్వార తెలుసుకోవచ్చు. పాకిస్థాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ కార్యాలయం విద్యుత్‌ బిల్లు బకాయి రూ.41 లక్షలు చెల్లించని కారణంగా సరఫరా నిలిపివేస్తామంటూ అక్కడి అధికారులు నోటీసులు జారీ చేశారు. దేశంలో నెలకొన్న ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోలేకపోతున్న ఇమ్రాన్‌ఖాన్‌ భారత్‌పై యుద్ధం చేస్తానని చెబుతుండడంపై పరిశీకులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. బిల్లు చెల్లించాలని ఎన్నిసార్లు నోటీసులు పంపినా స్పందించడం లేదు. వినియోగదారులు బకాయి వల్ల మేము విద్యుత్‌ ఉత్పత్తి సంస్థకు చెల్లింపు జరపలేకపోతున్నాం. ఇక వేచి చూసే ఓపిక మాకు లేదు. ప్రధాని కార్యాయమైనా సరఫరా నిలిపివేస్తాంగ అంటూ ఇస్లామాబాద్‌ విద్యుత్‌ సరఫరా కంపెనీ ఆ నోటీసుల్లో పేర్కొనడం గమనార్హం.