టెక్సాస్ ను వణికిస్తున్న హర్వే హరికేన్...

SMTV Desk 2017-08-31 10:52:15  america, texas, houston,harvey hurrican thufan,

అమెరికా, ఆగస్ట్ 31: అమెరికాను హర్వే హరికేన్ తుఫాన్ భయాందోళనకు గురిచేసింది. హర్వే హరికేన్ దాటికి టెక్సాస్ తీర ప్రాంతం మొత్తం విలవిలలాడుతుంది. హ్యూస్టన్ నగరం మొత్తం వరద నీటిలో మునిగిపోయింది, 72 గంటల్లో 76 సెంటి మీటర్ల కుండపోత వర్షం నమోదు కాగా, దాదాపు 13 లక్షల మంది ఈ వరద నీటిలో చిక్కుకొగా, 31 మంది మృతి చెందారు. హ్యూస్టన్ నగరంలో రోడ్లు అన్ని జలసంద్రం అయ్యాయి. దీంతో సహాయకచర్య బృందాలు బోట్ ల సహాయంతో అక్కడి వరద బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరాలించారు. ఈ వర్ష బీభత్సానికి అక్కడి రవాణా, విధ్యుత్ సరఫరా నిలిచిపోగా, ప్రజలు నిత్యావసరాలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. ప్రస్తుతం హర్వే హరికేన్ తుఫాన్ తూర్పు దిశగా కదులుతుండడంతో అక్కడ నివసిస్తున్న లక్షలాది మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఈ వరద ఉధృతిని అమెరికా అధ్యక్షుడు "ట్రంప్" పర్యవేక్షించి అధికారులతో సమావేశం అయ్యారు.