వెస్టిండీస్‌ ఫాస్ట్ బౌలర్‌ సెసిల్‌ రైట్‌ ఎట్టకేలకు వీడ్కోలు

SMTV Desk 2019-08-28 14:25:46  

వెస్టిండీస్‌ దిగ్గజాలు వివ్‌ రిచర్డ్స్‌, జోయెల్‌ గార్నర్‌, గ్యారీ సోబర్స్‌, ఫ్రాంక్‌ వోరెల్‌తో కలిసి క్రికెట్ ఆడిన ఫాస్ట్ బౌలర్‌ సెసిల్‌ రైట్‌ ఎట్టకేలకు వీడ్కోలు ప్రకటించారు. రెండు వారాల్లో 85వ వసంతంలోకి అడుగు పెడుతుండటంతో పూర్తిగా రిటైర్మెంట్‌ అవుతున్నట్లు పేర్కొన్నారు. రైట్‌ తన 60 ఏళ్లకు పైగా కెరీర్‌ 7 వేలకు పైగా వికెట్లు తీశాడు. ఒకానొక దశలో ఐదు సీజన్లలో 538 వికెట్లు తీసి సంచలనం సృష్టించాడు. బార్బడోస్‌తో మ్యాచ్‌లో జమైకాకు కెప్టెన్‌ బాధ్యతలు వహించాడు. ఇక సెప్టెంబర్‌ 7న పెన్నీ లీగ్‌లో అప్పర్‌మిల్‌ తరఫున స్ప్రింగ్‌హెడ్‌పై మ్యాచ్‌ ఆడి రైట్‌ వీడ్కోలు తీసుకోనున్నట్లు వెల్లడించారు.