ఎయిర్ ఇండియాకు కొత్త కష్టాలు

SMTV Desk 2019-08-23 10:49:04  

ప్రభుత్వరంగ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియాకు కొత్త కష్టాలు మొదలయ్యాయి. పెట్రోలియం కంపెనీలు ఆ సంస్థ విమానాలకు ఇందనం సరఫరా చేయడం నిలిపివేశాయి. ఎయిర్ ఇండియా తమకు బకాయిలు చెల్లించకపోవడంతో చేతనే ఈ నిర్ణయం తీసుకోవలసి వచ్చిందని పెట్రోలియం కంపెనీలు తెలిపాయి. విశాఖపట్నం, కొచ్చిన్, మొహాలీ, పూణే, రాంచీ, పాట్నా విమానాశ్రయాలలో బుదవారం సాయంత్రం నుంచి ఎయిర్ ఇండియా విమానాలకు ఇందనం సరఫరా నిలిపివేశామని పెట్రోలియం కంపెనీలు తెలిపాయి. బకాయిల చెల్లించాలని తాము ఎయిర్ ఇండియాకు పలుమార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ పట్టించుకోకపోవడంతో తప్పనిసరి పరిస్థితులలో ఇందనం సరఫరా నిలివేయాల్సి వచ్చిందని పెట్రోలియం కంపెనీలు తెలిపాయి. ఇంధన సరఫరా నిలిపివేయడంతో ఎయిర్ ఇండియా విమానాలు రద్దు చేసుకోవలసిన దుస్థితి ఏర్పడుతోంది. దనై వలన ప్రయాణికులు ఇబ్బంది పడటమే కాకుండా ఎయిర్ ఇండియా కూడా తీవ్రంగా నష్టపోతోంది. బకాయిల చెల్లింపులపై పెట్రోలియం కంపెనీలతో చర్చిస్తున్నామని, త్వరలోనే ఈ సంస్యను పరిష్కరించుకుంటామని ఎయిర్ ఇండియా తెలిపింది.