మన చందమామ ఫోటో

SMTV Desk 2019-08-23 10:48:21  

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రయోగించిన చంద్రయాన్-2 రెండు రోజుల క్రితం చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశించిన సంగతి తెలిసిందే. అది చంద్రుడికి 2650 కిమీ ఎత్తులో తిరుగుతూ తీసిన తొలి ఫోటోను ఇస్రో ట్విట్టర్‌ ద్వారా విడుదల చేసింది. ఇదివరకే చంద్రుడి ఉపరితలం ఏవిధంగా ఉంటుందో ఫోటోలలో చూసి ఉన్నప్పటికీ, చంద్రయాన్-2 తీసిన తాజా ఫోటో మరింత స్పష్టంగా ఉంది. చంద్రుడి ఉపరితలంపై అతి ముఖ్యమైన ప్రాంతాలుగా భావించే అపోలో క్రేటర్, ఓరియంటల్ బేసిన్‌లను కూడా చంద్రయాన్-2 స్పష్టంగా గుర్తించింది. ఇక నుంచి చంద్రయాన్-2 చంద్రుడికి మరింత దగ్గరకు చేరుకోనుంది కనుక మరిన్ని ఫోటోలు వచ్చే అవకాశం ఉంది.