రేవంత్ రెడ్డి ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయో

SMTV Desk 2019-08-23 10:44:10  

తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి తెరాస పార్టీ గట్టిగ ఎదుర్కునే దమ్మున్న నాయకుడు అంటే ముందుగా వినబడే పేరు రేవంత్ రెడ్డి… ఇప్పటికే కూడా తెరాస పార్టీ పేరు చెబితే ఉప్పెనలా ఎగసిపడతాడు రేవంత్ రెడ్డి. కాగా తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసి దారుణమైన ఓటమిని చవిచూసిన రేవంత్ రెడ్డి, ఆ తరువాత జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో మల్కాజిగిరి స్తానం నుండి ఎంపీగా గెలిచి తన సత్తా చాటారు రేవంత్ రెడ్డి… కాగా ఎంపీగా ఎన్నికను రేవంత్ర్ రెడ్డి అప్పట్లో బీజేపీలో చేరుతారనే ప్రచారం చాలా జరిగింది. కానీ తాను బీజేపీలోకి వెళ్లానని, చివరివరకు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరతారని స్పష్టం చేశారు. కాగా రేవంత్ రెడ్డి సరికొత్తగా ఒక ప్రణాలికలు సిద్ధం చేసుకున్నారనే వార్త ఇపుడు అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తుందని చెప్పాలి.

అయితే దేశంలోనే అతిపెద్ద నియోగకవర్గమైన మల్కాజిగిరి స్థానం నుండి ఎంపీగా ఎన్నికైన రేవంత్ రెడ్డి, ఇక తొందర్లో రానున్న మున్సిపల్ ఎన్నికల్లో తన నియోజకవర్గంలో కాంగ్రెస్ గెలుపుపై ఫోకస్ చేసుకున్నారట. కాగా మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఎలాగైనా గెలిపించాలని ఉద్దేశంతో ఇప్పటికే దానికి సంబందించిన గ్రౌండ్ వర్క్ మొదలుపెట్టారు రేవంత్ రెడ్డి. ఈమేరకు ఇప్పటికే క్షేత్రస్థాయి పర్యటనలకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారంట. అయితే తన నియోజకవర్గాన్ని గెలిపించి పార్టీ పై పట్టు సాదించాలని భావిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయో చూడాలి మరి…