ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌కు సుశీల్ కుమార్

SMTV Desk 2019-08-21 13:19:15  

భారత స్టార్ రెజ్లర్ సుశీల్ కుమార్ ఎట్టకేలకు ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌కు అర్హత సాధించాడు. తాజాగా నిర్వహించిన సెలక్షన్ ట్రయల్స్‌లో భాగంగా మంగళవారం జరిగిన 74 కిలోల ట్రయల్స్‌లో సుశీల్‌ కుమార్ 4-2తో జితేందర్‌ కుమార్‌ను ఓడించాడు. తొలి రౌండ్ ఆరంభంలోనే 4-0తో ఆధిక్యంలోకి వెళ్లిన సుశీల్.. ఆ తర్వాత కూడా అదే జోరును కొనసాగించాడు. అయితే జితేందర్ వరుసగా రెండు పాయింట్లు సాధించి రేసులోకి వచ్చినా.. పుంజుకున్న సుశీల్‌ మ్యాచ్‌ గెలిచాడు. కజకిస్థాన్‌లోని నూర్-సుల్తాన్‌ వేదికగా సెప్టెంబర్ 14న వరల్డ్ చాంపియన్‌షిప్‌ ప్రారంభం కానుంది.ఓడినా జితేందర్‌కు వరల్డ్‌ చాంపియన్‌షిప్‌ ఆశలు ఉన్నాయి. 79 కిలోల విభాగంలో అతను మరోసారి ట్రయల్స్‌లో పాల్గొనే అవకాశం ఉంది. ఇక 74 కిలోల ట్రయల్స్‌లో అమిత్‌ ధన్‌కర్‌ ఓడిపోయాడు. రాహుల్‌ ఆవ్రే (61 కిలోలు), కరణ్‌ (70 కి), ప్రవీణ్‌ (92 కి), వీర్‌దేవ్‌ గులియా (79 కి)లు నాన్‌ ఒలింపిక్‌ డివిజన్‌ ట్రయల్స్‌లో విజయం సాధించారు.