సుజీత్ పై ఛలోక్తులు విసిరిన ప్రభాస్

SMTV Desk 2019-08-19 14:25:03  

ప్రభాస్ హీరోగా, శ్రద్ధా కపూర్ హీరోయిన్‌గా భారీ బడ్జెట్ మూవీగా వస్తున్న సినిమా సాహో. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో గ్రాండ్‌గా జరిగింది. ఈ కార్యక్రమంలో సినిమా దర్శకుడు సుజిత్ మీద హీరో ప్రభాస్ ప్రశంసలు కురిపించాడు. సాహో సినిమా కథ చెప్పడానికి నిక్కర్ వేసుకుని వచ్చాడంటూ ఛలోక్తులు విసిరాడు. 22 ఏళ్ల వయసుకే సినిమాను డైరెక్ట్ చేసిన సుజిత్ మీద ఆయన ప్రశంసలు కురిపించాడు. సినిమా షూటింగ్‌కు ముందు ఏడాది పాటు ప్రీ ప్రొడక్షన్ వర్క్ చేశాడని, సినిమా కోసం సుమారు నాలుగేళ్లు కష్టపడ్డాడని చెప్పారు. పెద్ద పెద్ద టెక్నీషియన్స్‌ను ఎలా హ్యాండిల్ చేస్తాడోనని భయపడ్డానని వారిను హ్యాండిల్ చేసిన తీరు చూసి ముచ్చటేసిందన్నారు. సుజిత్‌ను చూస్తుంటే గ్రేటెస్ట్ డైరెక్టర్ అయిపోతాడనని ప్రభాస్ అన్నారు. సాహో సినిమాను నిర్మిస్తున్న యూవీ క్రియేషన్స్ అధినేతలు వంశీ, ప్రమోద్, విక్రమ్ మీద ప్రభాస్ పొగడ్తల వర్షం కురిపించాడు. సినిమాను తెలివిగా తీసి ఉంటే రూ.100 కోట్ల లాభం వచ్చేదని, అయితే, ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమా కోసం ఖర్చు పెట్టారన్నారు. ఇక శ్రద్ధాకపూర్‌ రెండేళ్ల పాటు ఎలాంటి ఇబ్బంది లేకుండా పనిచేసిందని, ముంబయి నుంచి వస్తూ ఒక్కరోజు కూడా మమ్మల్ని ఇబ్బంది పెట్టలేదని, యాక్షన్‌ సన్నివేశాలు కూడా బాగా చేసిందబు ఆమె సాహోకు పనిచేయడం మా అదృష్టమని అన్నారు.