ఊహించని మలుపులు, ట్విస్టులలతో సాగిన అద్భుత మర్డర్ మిస్టరీ: అల్లు అర్జున్

SMTV Desk 2019-08-19 14:23:21  

క్షణం, గూఢచారి వంటి సినిమాలతో మంచి పేరు తెచ్చుకున్న హీరో అడవి శేషు. ఈ హీరో ఇప్పుడు ఎవరు అనే సినిమా చేశారు. సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ట్విస్ట్ లు సినిమాకు ప్లస్ అయ్యాయి. రెజీనా నటనతో ఆకట్టుకుంది.

ఈ సినిమాను సామాన్య ప్రేక్షకులతో సెలెబ్రిటీలు కూడా మెచ్చుకుంటున్నారు. ఈ లిస్ట్ లో అల్లు అర్జున్ కూడా చేరిపోయారు. "ఎవరు మూవీని గత రాత్రి చూశాను. ఊహించని మలుపులు, ట్విస్టులలతో సాగిన అద్భుత మర్డర్ మిస్టరీ ఎవరు చిత్రం. అడివి శేషు వరుసగా మంచి చిత్రాలను చేస్తున్నాడు." అని అన్నారు బన్నీ. సినిమాలో నటించిన నటీనటులతో పాటు టెక్నిషియన్స్ ను కూడా అల్లు అర్జున్ ప్రత్యేకించి మెచ్చుకున్నారు. ప్రస్తుతం అల్లు అర్జున్ త్రివిక్రమ్ డైరెక్షన్ లో అల వైకుంఠపురంలో సినిమా చేస్తున్నారు. సంక్రాంతికి రిలీజ్ కాబోతున్నది.