జగన్ ఇంటి ముందు ఆత్మహత్య చేసుకుంటా...

SMTV Desk 2019-08-19 14:22:43  

మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబుపై కుట్రలు జరుగుతున్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న. బాబు హత్యకు కుట్రలు చేస్తున్నారని డ్రోన్ కెమెరా సాయంతో ఇంటి ఫోటోలు తీసుకున్నారని ఆరోపించారు. చంద్రబాబు ఇంటి దగ్గర మంత్రులు రెక్కీ చేశారని.. దీనిపై అనుమానాలు ఉన్నాయన్నారు. బాబును‌ రక్షించుకునేందుకు అవసరమైతే ముఖ్యమంత్రి జగన్ ఇంటి దగ్గర ఆత్మహత్యకు సిద్ధమంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు భద్రతపై ప్రధాని, హోంమంత్రి లేఖ రాస్తానన్న ఆయన అధినేతకు కేంద్ర రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. ఆదివారం మీడియాతో మాట్లాడిన ఆయన.. జగన్ సర్కార్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ అధికారంలోకి‌ వచ్చాక బాబుకు భద్రత తగ్గించారని.. హైకోర్టు భద్రత పెంచాలని చెప్పినా పట్టించుకోలేదని ఆరోపించారు వెంకన్న. చంద్రబాబు భద్రతపై తమకు ఆందోళన ఉందని. తమ అధినేతపై కుట్రలు చేస్తున్నారన్నారు. వైసీపీ ఈ కుట్రల్ని ఆపాలన్న ఆయన వాటిని భగ్నం చేయడానికి పోరాటం చేస్తానని అన్నారు.