పవన్ కళ్యాణ్ వాయిస్ ఓవర్ ప్రోమో వైరల్

SMTV Desk 2019-08-19 14:21:52  

మెగాస్టార్ చిరంజీవి 151వ చిత్రంగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సైరా టీజర్ రేపు విడుదల కానుండగా, టీజర్ ప్రోమోను చిత్ర యూనిట్ కొద్దిసేపటి క్రితం విడుదల చేసింది. ఈ సినిమాకు చిరంజీవి తమ్ముడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వాయిస్ ఓవర్ ను అందిస్తున్న సంగతి తెలిసిందే. అందుకు సంబంధించిన దృశ్యాలతో టీజర్ ప్రోమోను తయారు చేశారు. చిరంజీవితో కలిసి సినిమాను చూస్తూ పవన్ వాయిస్ ఓవర్ అందిస్తున్న సీన్స్ ఇందులో ఉన్నాయి. సైరా నరసింహారెడ్డి... అని పవన్ ఆవేశంతో చెప్పడం కనిపిస్తుంది.