వ‌ర‌ద బాధితుల‌కి 500 ఇళ్లు క‌ట్టించనున్న నానా ప‌టేక‌ర్..

SMTV Desk 2019-08-18 14:16:08  

ప్రముఖ న‌టుడు నానా ప‌టేక‌ర్.. వరద బాధితులకు అండగా నిలిచేందుకు ముందుకు వచ్చారు.. వరదలతో మహారాష్ట్ర సతమతం అవుతుండగా.. కొల్హాపూర్‌లోని షిరోల్ ప‌రిస‌ర ప్రాంతాల‌లోని ప్రజ‌లు వ‌ర‌ద‌లతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గూడు చెదిరిపోయి.. కూడు కూడా దొరకని పరిస్థితి వారిది. కొంద‌రైతే వ‌ర‌ద‌ల్ల తమ ఇళ్లు పూర్తిగా కొట్టుకుపోవడంతో నిరాశ్రయులయ్యారు. ఈ పరిస్థితి నటుడు నానా ప‌టేక‌ర్‌ను కదిలించివేసింది.. వ‌ర‌ద బాధితుల‌కి 500 ఇళ్లు క‌ట్టించేందుకు సిద్ధం అయ్యారాయన.. నేను షిరోల్‌కు వచ్చినప్పుడు, అక్కడి పరిస్థితిని చూశాను, అందుకే మేం 500 ఇళ్లను నిర్మించాలని నిర్ణయించున్నట్టు వెల్లడించారు. అంతేకాదు.. తక్లేవాడిలోని 3 వేల ఇళ్ల పరిస్థితిని సమీక్షించబోతున్నామన్నారు. ప్రభుత్వానికి కూడా పరిమితులు ఉంటాయని.. వరద బాధితులకు పునరావాసం కల్పించడానికి అంతా ప్రయత్నం చేయాలని పిలుపునిచ్చారు.