ఆయన ఏమన్నా ఒసామా బిన్ లాడెనా?

SMTV Desk 2019-08-17 16:38:41  

టీడీపీ అధినేత చంద్రబాబు ఉండవల్లి నివాసం వద్ద నిన్న డ్రోన్ తిరగడంపై పెద్ద వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే. తన భద్రతనే ప్రభుత్వం ప్రశ్నార్థకంగా మారుస్తోందని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే సమయంలో డీజీపీ, గుంటూరు ఎస్పీలకు ఫోన్ చేసి మాట్లాడారు. మరోవైపు కృష్ణా నది వరద విజువల్స్ ను చిత్రీకరించడంలో భాగంగానే డ్రోన్ తిరిగిందని, దీనికి, చంద్రబాబు నివాసానికి ఎలాంటి సంబంధం లేదని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. తాజాగా ఈ వివాదంపై ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందించారు.

తన ఇంటిపై డ్రోన్లు తిరిగితే చంద్రబాబు అంత ఆందోళన ఎందుకు చెందుతున్నారని వర్మ ప్రశ్నించారు. ఆయన ఏమన్నా ఒసామా బిన్ లాడెనా? అని అడిగారు. లేకపోతే చంద్రబాబు తన ఇంటి వెనుక ఏదైనా విలువైనది దాస్తున్నారా.. ఊరికే అడుగుతున్నా అంటూ ప్రశ్నించారు. ఈ మేరకు ఆర్జీవీ ట్విట్టర్ లో స్పందించారు.