మేము మంచి స్నేహితులం

SMTV Desk 2019-08-17 16:37:04  

విజయ్ దేవరకొండ, రష్మిక జంటగా నటించిన గీత గోవిందం సినిమా సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఇద్దరూ కలసి దర్శకుడు భరత్ కమ్మ తెరకెక్కించిన డియర్ కామ్రేడ్ చిత్రంలో నటించారు. ఈ చిత్రం కూడా బాక్సాఫీస్ వద్ద సందడి చేసింది. మరోవైపు, డియర్ కామ్రేడ్ షూటింగ్ మొదలైనప్పటి నుంచి విజయ్, రష్మికలు డేటింగ్ చేస్తున్నారంటూ సోషల్ మీడియా కోడై కూసింది. తాజాగా ఈ అంశంపై రష్మిక క్లారిటీ ఇచ్చింది. విజయ్ దేవరకొండ తనకు మంచి స్నేహితుడు మాత్రమేనని చెప్పింది. అంతకు మించి తామిద్దరి మధ్య మరేం లేదని స్పష్టం చేసింది.