అధికార పార్టీ వర్గపోరుతో సతమతమవుతోంది

SMTV Desk 2019-08-17 16:36:24  

గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో అధికార పార్టీ వర్గపోరుతో సతమతమవుతోంది. స్థానిక ఎమ్మెల్యే విడదల రజనీ, మరో నేత మర్రి రాజశేఖర్ వర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. దీనిపై రజనీ.. ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయుల వద్ద పంచాయితీ పెట్టారు. నియోజకవర్గంలో ఎంపీ పర్యటనపై ఎమ్మెల్యేకు కనీస సమాచారం ఇవ్వడం లేదని ఆరోపించారు. ఎంపీ కారు వద్ద రజనీ వర్గం నిరసన వ్యక్తం చేస్తుండగానే ఫ్లెక్సీల వివాదం తలెత్తింది. మర్రి రాజశేఖర్ పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను మున్సిపల్ సిబ్బంది తొలగించడంపై ఆయన వర్గం నిరసనకు దిగింది. ఫ్లెక్సీల్లో రజనీ ఫొటో లేకపోవడం వల్లే మున్సిపల్ సిబ్బందిపై ఒత్తిడి పెంచి వాటిని తొలగించివేశారని రాజశేఖర్ వర్గం ఆరోపిస్తోంది