హృతిక్‌ రోషన్‌కు ప్రపంచం మొత్తం ఫిదా

SMTV Desk 2019-08-17 16:34:24  

బాలీవుడ్‌లో హృతిక్‌ రోషన్‌కు ప్రపంచం మొత్తం ఫిదా అయిపోయింది... ఈ ఏడాదికి ది మోస్ట్ హ్యాండ్సమ్ మెన్ ఇన్ ది వరల్డ్ గా కొత్త రికార్డు సృష్టించాడు మన బాలీవుడ్ హీరో. అమెరికాకు చెందిన ఓ ఏజెన్సీ విడుదల చేసిన తాజా జాబితాలో.. టాప్ 5 మోస్ట్ హ్యాండ్సమ్ మెన్ జాబితాలో హృతిక్‌ టాప్ స్పాట్‌కు దూసుకెళ్లాడు. క్రిస్ ఎవాన్స్, డేవిడ్ బెక్హాం, రాబర్ట్ ప్యాటిన్సన్ వంటి మోస్ట్‌ హ్యాండ్సమ్‌లను నుంచి గట్టి పోటీని ఎదుర్కొన్నప్పటికీ.. వారికి వెనక్కి నెట్టిన హృతిక్ ది మోస్ట్ హ్యాండ్సమ్ మెన్ ఇన్ ది వరల్డ్ జాబితాలో తొలిస్థానంలో నిలిచాడు. ఇక, సూపర్ 30 మూవీ సూపర్ సక్సస్‌తో జోష్‌లో ఉన్న హృతిక్‌ రోషన్‌లో ఈ వార్త మరింత ఉత్సాహాన్ని నింపింది.