లాభాలతో కళకళలాడిన మార్కెట్లు

SMTV Desk 2019-08-14 18:09:11  

దేశీయ స్టాక్ మార్కెట్లు బుదవారం(ఆగస్ట్14) లాభాలతో కళకళలాడాయి. బీఎస్ఈ సెన్సెక్స్ ఇంట్రాడేలో 515 పాయింట్లు పెరగ్గా ఎన్ఎస్ఈ నిఫ్టీ కూడా 11,050 మార్క్‌ను అధిగమించింది. చివరకు సెన్సెక్స్ 353 పాయింట్ల లాభంతో 37,312 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. నిఫ్టీ 104 పాయింట్ల లాభంతో 11,029 పాయింట్ల వద్ద ముగిసింది. మెటల్, బ్యాంకు షేర్లలో కొనుగోళ్ల జోరు కనిపించింది. నిఫ్టీ 50లో యూపీఎల్, బజాజ్ ఫిన్‌సర్వ్, జీ ఎంటర్‌టైన్‌మెంట్, టాటా స్టీల్, వేదాంత షేర్లు లాభాల్లో ముగిశాయి. ఈ షేర్లన్నీ 4 శాతానికి పైగా ర్యాలీ చేశాయి. అదేసమయంలో సన్ ఫార్మా, ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్, విప్రో, కోల్ ఇండియా షేర్లు నష్టా్లో ముగిశాయి. సన్ ఫార్మా 5 శాతానికి పైగా పడిపోయింది. నిఫ్టీ‌ సెక్టోరల్ ఇండెక్స్‌లన్నీ లాభాల్లోనే క్లోజయ్యాయి. ఒక్క నిఫ్టీ ఫార్మా మాత్రం నష్టాల్లో ముగిసింది. నిఫ్టీ మెటల్ (2.34 శాతం), నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్ (1.52 శాతం) ఇండెక్స్‌లు ఎక్కువగా పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ (ముడి చమురు) ధరలు తగ్గాయి. బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 0.88 శాతం తగ్గుదలతో 60.41 డాలర్లకు క్షీణించింది. డబ్ల్యూటీఐ క్రూడ్ ధర బ్యారెల్‌కు 1.77 శాతం క్షీణతతో 56.11 డాలర్లకు తగ్గింది.