ఆ స్థలాన్ని విభజించడం వల్ల రాముడి విగ్రహాన్ని ధ్వంసం చేసినట్లే

SMTV Desk 2019-08-14 18:06:44  

న్యూఢిల్లీ: శ్రీరాముడు అయోధ్యలో జన్మించాడన్నది హిందువుల విశ్వాసమని, ఇందులో హేతుబద్ధత గురించి న్యాయస్థానాలు లోతుగా చూడకూడదని అయోధ్యలోని రామాలయ ప్రధాన పూజారి(రామ్‌లల్లా విరాజ్‌మాన్) సుప్రీంకోర్టులో వాదించారు. రామజన్మభూమి-బాబ్రీ మసీదు వివాదంపై రోజువారీ విచారణ జరుపుతున్న సుప్రీంకోర్టు ఎదుట బుధవారం రామ్‌లల్లా విరాజ్‌మాన్ తరఫున సీనియర్ న్యాయవాది సిఎస్ వైద్యనాథన్ తన వాదనలు వినిపిస్తూ రాముని విగ్రహం ఉన్న 2.77 ఎకరాల స్థలంపై ముస్లింలకు ఎటువంటి హక్కు లేదని, ఆ స్థలాన్ని విభజించడం వల్ల రాముడి విగ్రహాన్ని ధ్వంసం చేసినట్లేనని అన్నారు.