"అర్జున్ రెడ్డి" గూర్చి రాజమౌళి ఏమంటున్నారు?

SMTV Desk 2017-08-30 16:38:58  ARJUN REDDY MOVIE, DIRECTER RAJAMOULI, VIJAY DEVARAKONDA ACTING SUPERB

హైదరాబాద్, ఆగస్ట్ 30 : విజయ్ దేవరకొండ హీరోగా నటించిన "అర్జున్ రెడ్డి" చిత్రంపై టాలీవుడ్ ప్రముఖులు ప్రశంసల జల్లు కురిపించారు. అయితే తాజాగా ఈ చిత్రాన్ని చూసిన దర్శక ధీరుడు రాజమౌళి స్పందిస్తూ.. ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ నటన అద్భుత౦, ఆయన నటనలో జీవించాడని తెలిపారు. అసలు ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరు చాలా నేచురల్ గా నటించారని కొనియాడుతూ.. ఈ సినిమా ఇంతటి బ్లాక్ బస్టర్ సక్సెస్ ను సాధించినందుకు చిత్ర బృందానికి అభినందనలు తెలియజేశారు. అంతేకాకుండా ఈ సినిమాలో డైలాగులు కూడా అద్భుత౦గా ఉన్నాయని, దర్శకుడు సందీప్ రెడ్డి తెరకెక్కించిన విధానం చాలా బాగుందని రాజమౌళి ప్రశంసలు కుమ్మరించారు.