ఎమ్మెల్యే రోజా ఇంట్లో సిఎం కేసీఆర్‌ భోజనం!

SMTV Desk 2019-08-12 12:15:13  

సిఎం కేసీఆర్‌ ఈరోజు తిరుమల దర్శనానంతరం రోడ్డు మార్గం ద్వారా తమిళనాడులోని కాంచీపురంలోని వరదరాజస్వామి వారి ఆలయానికి వెళ్ళానున్నారు. మార్గమద్యలో వైసీపీ నగరి ఎమ్మెల్యే రోజా ఇంట్లో కాసేపు విశ్రాంతి తీసుకొని భోజనం చేయనున్నారు. సిఎం కేసీఆర్‌ వంటి గొప్ప వ్యక్తి తన ఇంటికి అతిధిగా వస్తునందుకు చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఏపీ మంత్రులు సిఎం కేసీఆర్‌కు రేణిగుంట విమానాశ్రయంలో స్వాగతం పలుకనున్నారు.