కొత్త ఇన్సూరెన్స్ పాలసీని ప్రవేశపెట్టిన ఇండియాఫస్ట్

SMTV Desk 2019-08-11 15:26:47  

ప్రముఖ బీమా కంపెనీ ఇండియాఫస్ట్ లైఫ్ ఇన్సూరెన్స్ తాజాగా మరో కొత్త ఇన్సూరెన్స్ పాలసీని ప్రవేశపెట్టింది. ఇండియాఫస్ట్ లైఫ్ స్మార్ట్‌పే ప్లాన్ పేరుతో అందుబాటులోకి వచ్చిన ఈ పాలసీ లిమిటెడ్ పే, మనీ బ్యాక్ వంటిది. ఇందులో లైఫ్ ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా లభిస్తుంది. పాలసీ తీసుకున్న పన్ను ప్రయోజనాలు లభిస్తాయి. ఒక్కసారి ప్రీమియం చెల్లింపుల్లో ఆలస్యమైనా కూడా పాలసీ లైఫ్ కవరేజ్ కొనసాగుతుంది. పాలసీ మెచ్యురిటీ సమయంలో బీమా మొత్తంతోపాటు బోనస్ కూడా పొందొచ్చు. 3 ఏళ్ల నుంచి 50 ఏళ్ల మధ్యలో వయసు ఉన్న వారు ఈ పాలసీ తీసుకోవచ్చు. పాలసీ టర్మ్ 10 నుంచి 15 ఏళ్లపాటు ఉంటుంది. కనీసం రూ.1.5 లక్షల మొత్తానికి పాలసీ తీసుకోవాలి. గరిష్ట పరిమితి అంటూ ఏమీ ఉండదు. పదేళ్ల కాలానికి పాలసీ తీసుకుంటే ఐదేళ్లు ప్రీమియం చెల్లిస్తే సరిపోతుంది. అలాగే 15 ఏళ్ల కాలానికి పాలసీ తీసుకుంటే 5 నుంచి 8 ఏళ్ల మధ్యలో ప్రీమియం చెల్లిస్తే సరిపోతుంది. ప్రీమియం చెల్లింపు విషయానికి వస్తే నెల, మూడు నెలలు, ఆరు నెలలు, ఏడాద చొప్పున ప్రీమియం చెల్లించొచ్చు. కనీస ప్రీమయయం నెలకు రూ.1,566 (రోజుకు రూ.52). ఉదాహరణకు 40 ఏళ్ల వ్యక్తి 15 ఏళ్ల కాలానికి ఇండియాఫస్ట్ లైఫ్ స్మా్ర్ట్ పే ప్లాన్ తీసుకుంటే ఈయన వార్షిక ప్రీమియం రూ.19,172గా ఉంటుంది. ఈయన 8 ఏళ్లపాటు ప్రీమియం చెల్లించాలి. పాలసీదారుడికి చివరి ప్రీమియం చెల్లింపునకు ముందు సర్వివల్ బెనిఫిట్ కింద రూ.19,747 లభిస్తాయి. ఇక పాలసీ మెచ్యురిటీ సమయంలో రూ.1,69,747 పొందొచ్చు. ఒకవేళ పాలసీదారుడు పాలసీ మెచ్యురిటీ కన్నా ముందే మరణిస్తే (పాలసీ తీసుకున్న 12వ సంవత్సరంలో) ఈయన కుబుంబానికి రూ.1.91 లక్షలు లభిస్తాయి. పాలసీపై లోన్ సదుపాయం కూడా ఉంది.