పక్షుల రెట్టలను డ్రగ్స్ గా భావించి ఫుట్‌బాల్ ప్లేయర్‌ అరెస్ట్!

SMTV Desk 2019-08-11 15:24:59  

జార్జీయాలోని సవన్నాలో ఓ వింత సంఘటన చోటుచేసుకుంది. ఆ ప్రదేశంలో డ్రగ్స్‌తో పట్టుబడే వ్యక్తులకు కఠిన శిక్షలు అమలు చేస్తారు.పోలీసులు ఈ విషయంలో చాలా ఖచ్చితంగా ఉంటారు. అయితే షాయ్ వెర్ట్స్ అనే 21 ఏళ్ల ఫుట్‌బాల్ ప్లేయర్‌ను ఇటీవల డ్రగ్స్ అక్రమ తరలింపు కేసులో అరెస్టు చేశారు. సౌత్ కరోలినాలోని క్లింటన్ ప్రాంతంలో కారులో వెళ్తుండగా జులై 31న పోలీసులు అడ్డుకున్నారు. కారును వేగంగా నడుపుతున్నాడనే కారణంతో అదుపులోకి తీసుకుని పోలీస్ కారులో కుర్చోబెట్టారు. అనంతరం అతడి కారును తనిఖీ చేయగా కారు బొన్నెట్‌లోని ఇంజిన్‌లో తెల్లని పదార్థం కనిపించింది. దీంతో అతడు డ్రగ్స్ తీసుకెళ్తున్నాడని భావించి పోలీసులు ఆ కేసు బనాయించారు. అది డ్రగ్ కాదని, పక్షుల రెట్టలని చెప్పినా వినిపించుకోలేదు. తాను ఫుట్‌బాల్ క్రీడాకారుడని తెలిపినా పట్టించుకోకుండా అరెస్టు చేశారు. దీంతో ఆ వెర్ట్ జార్జియా సదరన్ యూనివర్శిటీ అతడిని టీమ్‌ నుంచి తొలగించింది. కోర్టులో వెర్ట్ తరఫు న్యాయవాదులు ఆ పదార్థాన్ని పరీక్షించాలని కోరారు. ఫలితాల్లో అది డ్రగ్ కాదని తేలడంతో వెర్ట్‌పై ఆ కేసును తొలగించారు. కేవలం ఓవర్‌స్పీడ్‌కు మాత్రమే జరిమానా విధించారు. దీంతో యూనవర్శిటీ అతడిని మళ్లీ టీమ్‌లో చేర్చుకుంటున్నట్లు ప్రకటించింది.