పాకిస్థాన్ కు వార్నింగ్ ఇచ్చిన అమెరికా

SMTV Desk 2019-08-08 14:30:53  

భారత్ జమ్మూకాశ్మీర్ కు స్వయం ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్‌ 370 రద్దు చేస్తూ తీసుకున్న సంచలన నిర్ణయానికి పాకిస్థాన్ నిప్పులుచెరుగుతుంది. ఈ క్రమంలో పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కూడా పలు వ్యతిరేఖ వ్యాఖ్యలు చేశారు. దీంతో అమెరికా తాజాగా పాకిస్థాన్‌కు తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. భారత్‌తో దౌత్య సంబంధాలు, వాణిజ్యం విషయంలో పాక్ ప్రధాని ఇమ్రాన్ ప్రకటన నేపథ్యంలో.. సంయమనం పాటించాలని సూచించింది. చొరబాట్లను సహించబోమని హెచ్చరించింది. పాక్ గడ్డపై ఉన్న ఉగ్రవాద శిబిరాలపై ఉక్కుపాదం మోపాలని, ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గించే చర్యలు చేపట్టాలని సూచించింది.జమ్ముకశ్మీర్‌ను కేంద్రపాలిత ప్రాంతాలుగా విడగొట్టడాన్ని మేం జాగ్రత్తగా గమనిస్తున్నాం. ఈ చర్యల వల్ల రెండు దేశాల సరిహద్దులో మరిన్ని సమస్యలు ఉత్పన్నం కావొచ్చు. అంతేకాదు, ఈ ప్రాంతంలో అస్థిరత కూడా ఎక్కువవుతుందిగగ అని అమెరికా అధికార ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు. దక్షిణాసియా మిలటరీ మోహరింపులను నిరోధించాలంటే అత్యవసరంగా ఈ రెండు దేశాలు చర్చల్లో కూర్చోవాలని అమెరికా పేర్కొన్నారు.