రేపు పులివెందులలో.... వైఎస్ వివేకానందరెడ్డి విగ్రహావిష్కరణ!

SMTV Desk 2019-08-07 17:31:18  

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ రేపు కడప జిల్లా పులివెందులలో పర్యటిస్తారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ పర్యటనలో భాగంగా జగన్ రేపు ఉదయం 9.35 గంటలకు కడప ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్ లో పులివెందుల గాయత్రి కాలనీలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్ద దిగుతారు. ఉదయం 10.20 గంటలకు హెలిప్యాడ్‌ నుంచి బయలుదేరి 10.30 గంటలకు భాకరాపురం చేరుకుంటారు. అక్కడే వైఎస్ వివేకానందరెడ్డి విగ్రహాన్ని ముఖ్యమంత్రి ఆవిష్కరిస్తారు.

అనంతరం భాకరాపురం నుంచి 11 గంటలకు బయలుదేరి పులివెందుల ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ కు వెళతారు. 11.15 గంటల నుంచి 12.15 గంటల వరకు పులివెందుల అభివృద్దిపై అధికారులతో ముఖ్యమంత్రి జగన్ సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. మధ్యాహ్నం 1.00 గంటకు అక్కడి నుంచి బయలుదేరి అనంతపురం జిల్లా పెనుకొండకు వెళతారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం మీడియాకు సమాచారం అందించింది.