భారత్ చర్యలను జీర్ణించుకోలేకపోతున్న చైనా

SMTV Desk 2019-08-07 17:28:34  

భారత్ విషయంలో చైనా మరింత దిగజారిపోయి ప్రవర్తిస్తుంది. తాజాగా ఆర్టికల్ 370 రద్దు తరువాత చైనా మరింత రెచ్చిపోతోంది. లడఖ్ ప్రాంతాన్ని కేంద్ర పాలితా ప్రాంతంగా చేయడం ఇష్టం లేని డ్రాగన్ భారత్ నిర్ణయాన్ని తప్పుబడుతోంది. అంతటితో ఆగకుండా కైలాస్, మానస సరోవర్ యాత్రకు వెళ్లాలనుకునే వారికి వీసాలు ఇచ్చేందుకు నిరాకరిస్తోంది. భారత్‌పై ఎలా తమ అక్కసు వెళ్లగక్కాలో తెలియక ఇలాంటి వక్రబుద్ధికి పాల్పడుతోందనే విమర్శలు మూటగట్టుకుంటోంది.లడఖ్ కేంద్ర పాలితా ప్రాంతంగా మార్చడాన్ని డ్రాగన్ మొదటి నుంచి అభ్యంతరం చెబుతూనే ఉంది. భారత్ చర్యలు సార్వభౌమాధికారాన్ని ప్రశ్నించేలా ఉన్నాయని అసహనం వ్యక్తం చేసింది. అయితే భారత్ కూడా దీనికి ధీటుగా సమాధానం చెప్పంది. అది తమ అంతర్గత వ్యవహారమని ఇతర దేశాలు కల్పించుకోకుండా ఉంటే మంచిదని కౌంటర్ ఇచ్చింది. భారత్ చర్యలను జీర్ణించుకోలేకపోయిన చైనా మానసరోవర్ వెళ్లేవారి పట్ల కఠినంగా వ్యవహరించడం గమనార్హం.