రకుల్ ను తీసుకోవద్దని నేను చెప్పలేదు: నాగార్జున

SMTV Desk 2019-08-07 17:26:27  

నాగార్జున కథానాయకుడిగా రూపొందిన మన్మథుడు 2 ఈ నెల 9వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ లో నాగార్జున బిజీగా వున్నారు. తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ .. "ఈ సినిమాలో నేను ముదురు బ్రహ్మచారి పాత్రలో కనిపిస్తాను. కథాపరంగా నాకు తల్లి .. ముగ్గురు సోదరీమణులు వుంటారు.

నాకు పెళ్లి చేయడానికి వాళ్లంతా గట్టి ప్రయత్నం చేస్తారు. ఆ పెళ్లి ఇష్టం లేని నేను ఏం చేస్తాననే కథతో ఈ సినిమా సాగుతుంది. నా సరసన రకుల్ కనిపిస్తుంది. ఈ సినిమా షూటింగు కొత్తలో అనుకుంటా, రకుల్ ను నాయికగా తీసుకోవడం నాకు ఇష్టం లేదని రాశారు. ఆ వార్తలో ఎంతమాత్రం నిజం లేదు. ఈ సినిమాలో అవంతిక పాత్రను ఆమె చాలా బాగా చేసింది. ప్రస్తుతం బిగ్ బాస్ 3 తో బిజీగా వున్నాను. ఆ తరువాత బంగార్రాజు ప్రాజెక్టును గురించి ఆలోచిస్తాను" అని చెప్పుకొచ్చారు.