ఆర్టికల్ 370 రద్దు...పాకిస్తాన్ పై భారతీయిల ట్రోల్ల్స్

SMTV Desk 2019-08-06 11:52:21  

‘ఆర్టికల్ 370’ని కేంద్ర ప్రభుత్వం ఆగస్ట్ 05 న రద్దు చేసింది. దీంతో జమ్ముకాశ్మీర్ స్వతంత్ర ప్రతిపత్తి కోల్పోయి దేశంలో భాగం కానుంది. మోదీ ప్రభుత్వం తీసుకున్న ఈ సాహసోపేత నిర్ణయంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీంతో నెటిజన్లు ‘కశ్మీర్ మనదే’ అంటూ సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. రాజ్యసభలో సోమవారం డివిజన్ పద్ధతిలో జరిగిన ఓటింగ్‌లో 64 ఓట్ల మెజార్టీతో ఈ బిల్లు ఆమోదం పొందింది. బిల్లుకు అనుకూలంగా 125 మంది సభ్యులు, వ్యతిరేకంగా 61 మంది ఓట్లు వేశారు. ఒక సభ్యుడు మాత్రం తటస్థంగా ఉన్నారు. దీనిపై మంగళవారం లోక్‌సభలో చర్చ జరగనుంది. లోక్‌సభలోనూ ఈ బిల్లు పాసైతే.. రాష్ట్రపతి ఆమోదంతో చట్టం రూపం దాల్చనుంది. ఆ వెంటనే కశ్మీర్‌ రాష్ట్రానికి స్వతంత్ర ప్రతిపత్తి కల్పిస్తున్న ఆర్టికల్ 370 రద్దవుతుంది. కశ్మీర్ పూర్తిగా భారత భూభాగంలో చేరుతుంది. దీంతో నెటిజనులు #KashmirHamaraHai హ్యాష్‌ట్యాగ్‌తో మోదీ, అమిత్ షాలను ఆకాశాన్న ఎత్తేస్తున్నారు. ఇద్దరూ చాలా ధైర్యమైన నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు. ఇంకొందరు.. కశ్మీర్ తర్వాత ఆక్రమిత కశ్మీర్ (పీవోకే) కూడా ఇండియా సాధిస్తుందని అంటున్నారు. మరికొందరైతే.. తర్వాతి టార్గెట్ ‘లాహోరే’ అంటూ ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఫొటోలతో జోకులు పేలుస్తున్నారు.