మూతబడ్డ మెడికల్ కాలేజీ...భయాందోళనలో ఫాతిమా విద్యార్ధులు

SMTV Desk 2017-08-30 14:55:03  kadapa, medical college,Fathima Institute of Medical Sciences, supreme court notice

న్యూఢిల్లీ, ఆగస్ట్ 30: కడప ఫాతిమా మెడికల్ కాలేజ్ కేసు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ కేసులో కేంద్రానికి, ఎంసీఐకి కోర్టు నోటిసులు జారీ చేసింది. వంద మంది విద్యార్థులకు ఏ కళాశాలల్లో సీట్లు ఇస్తారో నివేదిక సమర్పించాలని కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను కోర్టు వచ్చే నెల 21కి వాయిదా వేసింది. 2015, 2016లో సరైన సదుపాయాలు లేవని ఫాతిమా మెడికల్ కాలేజీ అనుమతులు రద్దుచేసిన విషయం తెలిసిందే.