అదిలాబాద్‌లో పెన్‌గంగ భవన్‌ ప్రారంభోత్సవం

SMTV Desk 2019-08-06 11:45:09  

రాష్ట్ర అటవీశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి సోమవారం అదిలాబాద్‌లో పెన్‌గంగ భవన్‌ ప్రారంభోత్సవం చేశారు. రూ. జిల్లా నీటిపారుదలశాఖ అధికారులు ప్రాజెక్టు నిర్మాణ పనులు పర్యవేక్షణకు వచ్చినప్పుడు ఉపయోగించుకోవడానికి, ప్రాజెక్టు కార్యాలయంగా వినియోగించుకునేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం రూ.5.28 కోట్లు వ్యయంతో పెన్‌గంగ భవన్‌, గెస్ట్ హౌస్ నిర్మించింది. ఈ సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కార్యాలయం ఆవరణలో మొక్కలు నాటారు. మీడియాతో మాట్లాడుతూ, “ఇప్పటివరకు కోర్టా-చనకా బ్యారేజీ నిర్మాణపనులు చాలా జోరుగా సాగడంతో 17 గేట్లు బిగించడం పూర్తయింది. కానీ వర్షాల కారణంగా పనులు నిలిచిపోతున్నాయి. ఈ ప్రాజెక్టు పూర్తయితే పెన్‌గంగ పరిధిలో సుమారు 50,000 ఎకరాలకు నిరంతరం నీటిని అందించవచ్చు. ఈ ఏడాది చివరిలోగా కోర్టా-చనకా బ్యారేజీ పనులు పూర్తవుతాయి,” అని అన్నారు.